శివ పంచాక్షరి స్తోత్రం

అక్షరాల పరిమాణం:
శ్రీ మహాశివుడు

విశేషం: శివ పంచాక్షరి స్తోత్రం ‘నమః శివాయ’ అనే మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. దీనిని పఠించడం వల్ల శివ సాయుజ్యం లభిస్తుంది.

శివ పంచాక్షరి స్తోత్రం

కీర్తన

ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ శివాయ నమః ఓం

స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ । నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై “న” కారాయ నమః శివాయ ॥ 1 ॥

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ । మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై “మ” కారాయ నమః శివాయ ॥ 2 ॥

శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ । శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై “శి” కారాయ నమః శివాయ ॥ 3 ॥

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ । చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై “వ” కారాయ నమః శివాయ ॥ 4 ॥

యజ్ఞ-స్వరూపాయ జటాధరాయ [యక్ష-] పినాక హస్తాయ సనాతనాయ । దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై “య” కారాయ నమః శివాయ ॥ 5 ॥

ఫలశ్రుతి

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥