అచ్యుతాష్టకం

అక్షరాల పరిమాణం:

అచ్యుతాష్టకం (Achyutashtakam)

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ॥

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ ।
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే ॥ 2 ॥

విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే ।
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే ।
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥

రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః ।
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥

ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వణ్శికావాదకః ।
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా ॥ 6 ॥

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ ।
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7॥

కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః ।
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే ॥ 8 ॥

ఫలశృతి

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ ।
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ॥

ఇతి శ్రీశంకరాచార్యవిరచితమచ్యుతాష్టకం సంపూర్ణమ్ ॥


విశిష్టత మరియు తాత్పర్యం (Significance & Meaning)

జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడి నామాలను ఎంతో సుందరంగా తలచుకుంటూ పలకడానికి అనువుగా ఈ స్తోత్రాన్ని రచించారు.

అచ్యుతుడు, కేశవుడు, శ్రీరాముడు, నారాయణుడు, కృష్ణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరి, శ్రీధరుడు, మాధవుడు, గోపికావల్లభుడు, జానకీనాయకుడు, రామచంద్రుడు… ఇలా ఏ నామంతో పిలిచినా పలికే ఆ భగవంతుని నేను భజిస్తున్నాను అని ఈ అష్టకం చెబుతుంది. దీన్ని ప్రతిరోజూ ప్రేమతో పఠిస్తే భగవంతునితో శాశ్వతమైన బంధం ఏర్పడుతుంది.