గోకుల అష్టకం

అక్షరాల పరిమాణం:

గోకుల అష్టకం (Gokula Ashtakam)

శ్రీమద్గోకులసర్వస్వం శ్రీమద్గోకులమండనమ్ ।
శ్రీమద్గోకులదృక్తారా శ్రీమద్గోకులజీవనమ్ ॥ 1 ॥

శ్రీమద్గోకులమాత్రేశః శ్రీమద్గోకులపాలకః ।
శ్రీమద్గోకులలీలాబ్ధిః శ్రీమద్గోకులసంశ్రయః ॥ 2 ॥

శ్రీమద్గోకులజీవాత్మా శ్రీమద్గోకులమానసః ।
శ్రీమద్గోకులదుఃఖఘ్నః శ్రీమద్గోకులవీక్షితః ॥ 3 ॥

శ్రీమద్గోకులసౌందర్యం శ్రీమద్గోకులసత్ఫలమ్ ।
శ్రీమద్గోకులగోప్రాణః శ్రీమద్గోకులకామదః ॥ 4 ॥

శ్రీమద్గోకులరాకేశః శ్రీమద్గోకులతారకః ।
శ్రీమద్గోకులపద్మాళిః శ్రీమద్గోకులసంస్తుతః ॥ 5 ॥

శ్రీమద్గోకులసంగీతః శ్రీమద్గోకులలాస్యకృత్ ।
శ్రీమద్గోకులభావాత్మా శ్రీమద్గోకులపోషకః ॥ 6 ॥

శ్రీమద్గోకులహృత్స్థానః శ్రీమద్గోకులసంవృతః ।
శ్రీమద్గోకులదృక్పుష్పః శ్రీమద్గోకులమోదితః ॥ 7 ॥

శ్రీమద్గోకులగోపీశః శ్రీమద్గోకులలాలితః ।
శ్రీమద్గోకులభోగ్యశ్రీః శ్రీమద్గోకులసర్వకృత్ ॥ 8 ॥

ఫలశృతి

ఇమాని శ్రీగోకులేశనామాని వదనే మమ ।
వసంతు సంతతం చైవ లీలా చ హృదయే సదా ॥ 9 ॥

ఇతి శ్రీవిఠ్ఠలేశ్వర విరచితం శ్రీ గోకులాష్టకమ్ ।


విశిష్టత మరియు తాత్పర్యం (Significance & Meaning)

శ్రీ వల్లభాచార్యుల రెండవ కుమారులైన శ్రీ విఠ్ఠలేశ్వర ప్రభువు వారి చేత రచించబడిన సంస్కృత అష్టకం ఈ గోకులాష్టకం.

ఈ అష్టకంలో ప్రతీ పదంలోనూ “శ్రీమద్గోకుల” (పవిత్రమైన గోకులం) అన్న మాట పునరావృతం వ్యాస వైభవాన్ని తెలియజేస్తుంది. ఆ గోకులానికి అలంకారమైన, గోకులానికి ప్రాణమైన, గోకుల వాసుల దుఃఖాన్ని హరించే, మరియు గోపికల హృదయ స్థానమైన శ్రీ కృషుడిని ఎంత వర్ణించినా తక్కువే అని దీని భావం. “ఈ గోకులేశుని నామాలు ఎల్లప్పుడూ నా నాలుకపైన, అతని లీలలు ఎల్లప్పుడూ నా హృదయంలో కొలువై ఉండుగాక” అని భక్తుడు చివరి ఫలశృతిలో స్వామిని వేడుకుంటున్నారు.