నవగ్రహ స్తోత్రం
విశేషం: నవగ్రహాల అనుగ్రహం కోసం ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. ఇది గ్రహ దోషాలను తొలగించి, జాతకంలో గ్రహాల స్థితిని అనుకూలంగా మారుస్తుంది.
నవగ్రహ స్తోత్రం
నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ । గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
గ్రహ స్తోత్రాలు
రవిః (సూర్యుడు) జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ । తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
చంద్రః దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) । నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥
కుజః (అంగారకుడు) ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ । కుమారం శక్తిహస్తం తం కుజం [మంగళం] ప్రణమామ్యహమ్ ॥
బుధః ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ । సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥
గురుః (బృహస్పతి) దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ । బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥
శుక్రః హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ । సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
శనిః (శనైశ్చరుడు) నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ । ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥
రాహుః అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ । సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
కేతుః పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ । రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥
ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః । దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥
నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ । ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః । తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥
ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ ।