పశుపత్యష్టకం
పశుపత్యష్టకం (Pashupatyashtakam)
పశుపతీందుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిమ్ ।
ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ 1 ॥
న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులమ్ ।
అవతి కోఽపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిమ్ ॥ 2 ॥
మురజడిండిమవాద్యవిలక్షణం మధురపంచమనాదవిశారదమ్ ।
ప్రమథభూతగణైరపి సేవితం భజత రే మనుజా గిరిజాపతిం ॥ 3 ॥
శరణదం సుఖదం శరణాన్వితం శివ శివేతి శివేతి నతం నృణామ్ ।
అభయదం కరుణావరుణాలయం భజత రే మనుజా గిరిజాపతిం ॥ 4 ॥
నరశిరోరచితం మణికుండలం భుజగహారముదం వృషభధ్వజమ్ ।
చితిరజోధవలీకృతవిగ్రహం భజత రే మనుజా గిరిజాపతిం ॥ 5 ॥
మఖవినాశకరం శశిశేఖరం సతతమధ్వరభాజిఫలప్రదమ్ ।
ప్రళయదగ్ధసురాసురమానవం భజత రే మనుజా గిరిజాపతిం ॥ 6 ॥
మదమపాస్య చిరం హృది సంస్థితం మరణజన్మజరామయపీడితమ్ ।
జగదుదీక్ష్య సమీపభయాకులం భజత రే మనుజా గిరిజాపతిం ॥ 7 ॥
హరివిరంచిసురాధిపపూజితం యమజనేశధనేశనమస్కౄతమ్ ।
త్రినయనం భువనత్రితయాధిపం భజత రే మనుజా గిరిజాపతిం ॥ 8 ॥
ఫలశృతి
పశుపతేరిదమష్టకమద్భుతం విరచితం పృథివీపతిసూరిణా ।
పఠతి సంశఋణుతే మనుజః సదా శివపురీం వసతే లభతే ముదమ్ ॥ 9 ॥
ఇతి శ్రీపశుపత్యష్టకం సంపూర్ణమ్ ॥
విశిష్టత మరియు తాత్పర్యం (Significance & Meaning)
సంసార లంపటంలో పడి నిజమైన రక్షకుడ్ని మరచిపోతున్న దేహధారులకు కనువిప్పు కలిగించే పవిత్ర అష్టకం ఇది. “భజత రే మనుజా గిరిజాపతిం” (ఓ మానవులారా, గిరిజకు పతి అయిన ఆ పరమశివుడినే సదా భజించండి (కొలవండి)) అని ప్రతీ శ్లోకం చివర్లో హెచ్చరిస్తుంది.
కాలవశం సమీపించిన నాడు ఏ తల్లిదండ్రులూ, బంధువులూ, భార్యా పిల్లలు మనల్ని రక్షించలేరు. రక్షించే వాడొక్కడే ఆ పరమాత్మ. ప్రాపంచిక మదాన్ని వీడి, పాలకులనే పరిపాలించే ఆ పశుపతిని (సమస్త జీవరాశులకు అధిపతిని) వేడుకోండిని ఈ అష్టకం చెబుతుంది. దీనిని నియమంతో ఎవరు పఠిస్తారో వారు తప్పక కైలాస పురాన్ని పచేరుకొని శాశ్వత ఆనందాన్ని పొందుతారు.