శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళి

📿
అక్షరాల పరిమాణం:
శ్రీ హనుమంతుడు

శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళి

ఓం ఆంజనేయాయ నమ: ఓం మహావీరాయ నమ: ఓం మారుతాత్మాజాయ నమః ఓం తత్వఙ్ఞానప్రదాయకాయ నమః ఓం హనుమతే నమః

ఓం సీతాదేవీ ముద్రాప్రదాయకాయ నమ: ఓం అశోక వనవిచ్చేత్రే నమ: ఓం సర్వ మాయా విభంజనాయ నమ: ఓం సర్వబంధవిముక్త్రే నమ: ఓం రక్షోవిధ్వంసకారకాయ నమ:

ఓం పరవిద్యాపరిహారాయ నమ: ఓం పర శౌర్య వినాశాయ నమ: ఓం పరమంత్ర నిరాకర్త్రే నమ: ఓం పరయంత్రప్రభేదకాయ నమ: ఓం సర్వగ్రహవినాశినే నమ:

ఓం భీమసేన సహాయకృతేనె నమ: ఓం సర్వదు:ఖ హరాయ నమ: ఓం సర్వలోకచారిణే నమ: ఓం మనో జవాయ నమ: ఓం పారిజాతదృమూలస్థాయ నమ:

ఓం సర్వమంత్ర స్వరూపాయ నమ: ఓం సర్వతంత్ర స్వరూపాయ నమ: ఓం సర్వయంత్రాత్మికాయ నమ: ఓం కపీశ్వరాయ నమ: ఓం మహాకాయాయ నమ:

ఓం సర్వరోగహరాయ నమ: ఓం ప్రభవే నమ: ఓం బలసిద్ధికారయ నమ: ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమ: ఓం కపిసేననాయకాయనమ:

ఓం భవిష్యత్చతురాననాయ నమ: ఓం కుమారబ్రహ్మచారిణే నమ: ఓం రత్నకుండల దీప్తిమతే నమ: ఓం సంచలనధ్వాలసన్నద్ధ లంబాననానశిఖరోజ్వలాయనమ: ఓం గంధర్వవిద్యాతత్వఙ్ఞానాయ నమ:

ఓం మహాబలపరాక్రమాయ నమ: ఓం కారాగృహ విముక్తే నమ: ఓం శృంఖలాబంధవిముక్తాయ నమ: ఓం సాగరోత్తారకాయ నమ: ఓం ప్రఙ్ఞాయ నమ:

ఓం రామదూతాయ నమ: ఓం ప్రతాపవతే నమ: ఓం వానరాయ నమ: ఓం కేసరీసుతాయ నమ: ఓం సీతాశోకనివారణాయ నమ:

ఓం అంజనాగర్భసంభూతాయ నమ: ఓం బాలార్కసదృశ్యాయ నమ: ఓం విభీషణప్రియకరాయ నమ: ఓం దశగ్రీవకులాంతకాయ నమ: ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ:

ఓం వజ్రకాయాయ నమ: ఓం మహాద్యుతయే నమ: ఓం చిరంజీవియనే నమ: ఓం రామభక్తాయ నమ: ఓం దైత్యకార్యవిఘాతాయ నమ:

ఓం అక్షహంత్రే నమ: ఓం కాంచనాభాయ నమ: ఓం పంచవక్త్రాయ నమ: ఓం మహాతపసే నమ: ఓం లంఖిణీభంజనాయ నమ:

ఓం శ్రీమతే నమః ఓం సింహికా ప్రాణ భంజనాయ నమ: ఓం గంధమాధనశైలస్థాయ నమ: ఓం లంకాపురవిదాహకాయ నమ: ఓం సుగ్రీవసచివాయ నమ:

ఓం ధీరాయ నమ: ఓం శూరాయ నమ: ఓం దైత్యకులాంతకాయ నమ: ఓం సురార్చితాయ నమ: ఓం మహాతేజాయ నమ:

ఓం రామచూడామణిప్రదాయకాయనమ: ఓం కామరూపాయ నమ: ఓం పింగళాక్షాయ నమ: ఓం వార్ధిమైనాకపూజితాయ నమ: ఓం కబళీకృతమార్తాండ మండలాయనమ:

ఓం విజితేంద్రియాయ నమ: ఓం రామసుగ్రీవసంధాత్రే నమ: ఓం మహారావణమర్ధనాయ నమ: ఓం స్పటికాభాయ నమ: ఓం వాగధీశాయ నమ:

ఓం నవవ్యాకృతిపండితాయ నమ: ఓం చతుర్భాహువే నమ: ఓం దీనబంధువే నమ: ఓం మహాత్మానే నమ: ఓం భక్తవత్సలాయ నమ:

ఓం సంజీవనగాహర్త్రే నమ: ఓం శుచయే నమ: ఓం వాగ్మినే నమ: ఓం దృఢవ్రతాయ నమ: ఓం కాలనేమి ప్రమధనాయ నమ:

ఓం హరిమర్కట మర్కటాయ నమ: ఓం దాంతాయ నమ: ఓం శాంతాయ నమ: ఓం ప్రసన్నాత్మనే నమ: ఓం శతకంఠమదాపహృతే నమ:

ఓం యోగినే నమ: ఓం రామకథాలోలాయ నమ: ఓం సీతాన్వేవేషణపండితాయ నమ: ఓం వజ్రదంష్ట్రాయ నమ: ఓం వజ్రనఖాయ నమ:

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ: ఓం ఇంద్రజిత్ప్రయోగితామోఘబ్రహ్మాస్త్ర నివారకాయనమ: ఓం పార్ధధ్వజాగ్రవాసినేనమ: ఓం శరపంజరవిభేధకాయ నమ: ఓం దశబాహవే నమ:

ఓం లోకపూజ్యాయ నమ: ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ: ఓం సీతాసమేతశ్రీరామపాదసేవా దురంధరాయనమ:

ఫలశృతి మరియు విశిష్టత (Significance and Benefits)

శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళిని నిత్యం పఠించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది.

  • శక్తి మరియు ధైర్యం: హనుమంతుడు ధైర్యం మరియు కార్యసిద్ధికి మూలం. ఆయన నామాలను జపించడం వల్ల మానసిక భీతి తొలగి మనోధైర్యం పెరుగుతుంది.
  • శని దోష నివారణ: శని దేవుడు స్వయంగా హనుమద్భక్తులను పీడించనని వరం ఇచ్చాడు. కావున, శని దోషాలు ఉన్నవారు శనివారం నాడు ఈ నామాలు పఠించడం శ్రేయోదాయకం.
  • రక్షా కవచం: దుష్ట శక్తులు, ప్రతికూల ఆలోచనల నుండి హనుమంతుడు రక్షణ కవచం వలె కాపాడతాడు. కేవలం రామ నామ స్మరణతోనే ప్రసన్నమయ్యే ఈ స్వామిని కొలిచిన వారికి సకల విజయాలు సిద్ధించును.

(శ్రీ ఆంజనేయాయ నమః!)