శ్రీ శుక్ర అష్టోత్తర శతనామావళి

📿
అక్షరాల పరిమాణం:

విశేషం: నవగ్రహాలలో శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. శుక్రవారం నాడు ఈ అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, సుఖ సంతోషాలు మరియు సకల ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.

ఓం శుక్రాయ నమః । ఓం శుచయే నమః । ఓం శుభగుణాయ నమః । ఓం శుభదాయ నమః । ఓం శుభలక్షణాయ నమః । ఓం శోభనాక్షాయ నమః । ఓం శుభ్రరూపాయ నమః । ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః । ఓం దీనార్తిహరకాయ నమః । ఓం దైత్యగురవే నమః ॥ 10 ॥

ఓం దేవాభివందితాయ నమః । ఓం కావ్యాసక్తాయ నమః । ఓం కామపాలాయ నమః । ఓం కవయే నమః । ఓం కళ్యాణదాయకాయ నమః । ఓం భద్రమూర్తయే నమః । ఓం భద్రగుణాయ నమః । ఓం భార్గవాయ నమః । ఓం భక్తపాలనాయ నమః । ఓం భోగదాయ నమః ॥ 20 ॥

ఓం భువనాధ్యక్షాయ నమః । ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః । ఓం చారుశీలాయ నమః । ఓం చారురూపాయ నమః । ఓం చారుచంద్రనిభాననాయ నమః । ఓం నిధయే నమః । ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః । ఓం నీతివిద్యాధురంధరాయ నమః । ఓం సర్వలక్షణసంపన్నాయ నమః । ఓం సర్వావగుణవర్జితాయ నమః ॥ 30 ॥

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః । ఓం సకలాగమపారగాయ నమః । ఓం భృగవే నమః । ఓం భోగకరాయ నమః । ఓం భూమిసురపాలనతత్పరాయ నమః । ఓం మనస్వినే నమః । ఓం మానదాయ నమః । ఓం మాన్యాయ నమః । ఓం మాయాతీతాయ నమః । ఓం మహాశయాయ నమః ॥ 40 ॥

ఓం బలిప్రసన్నాయ నమః । ఓం అభయదాయ నమః । ఓం బలినే నమః । ఓం బలపరాక్రమాయ నమః । ఓం భవపాశపరిత్యాగాయ నమః । ఓం బలిబంధవిమోచకాయ నమః । ఓం ఘనాశయాయ నమః । ఓం ఘనాధ్యక్షాయ నమః । ఓం కంబుగ్రీవాయ నమః । ఓం కళాధరాయ నమః ॥ 50 ॥

ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః । ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః । ఓం శ్వేతాంబరాయ నమః । ఓం శ్వేతవపుషే నమః । ఓం చతుర్భుజసమన్వితాయ నమః । ఓం అక్షమాలాధరాయ నమః । ఓం అచింత్యాయ నమః । ఓం అక్షీణగుణభాసురాయ నమః । ఓం నక్షత్రగణసంచారాయ నమః । ఓం నయదాయ నమః ॥ 60 ॥

ఓం నీతిమార్గదాయ నమః । ఓం వర్షప్రదాయ నమః । ఓం హృషీకేశాయ నమః । ఓం క్లేశనాశకరాయ నమః । ఓం కవయే నమః । ఓం చింతితార్థప్రదాయ నమః । ఓం శాంతమతయే నమః । ఓం చిత్తసమాధికృతే నమః । ఓం ఆధివ్యాధిహరాయ నమః । ఓం భూరివిక్రమాయ నమః ॥ 70 ॥

ఓం పుణ్యదాయకాయ నమః । ఓం పురాణపురుషాయ నమః । ఓం పూజ్యాయ నమః । ఓం పురుహూతాదిసన్నుతాయ నమః । ఓం అజేయాయ నమః । ఓం విజితారాతయే నమః । ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః । ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః । ఓం మందహాసాయ నమః । ఓం మహామతయే నమః ॥ 80 ॥

ఓం ముక్తాఫలసమానాభాయ నమః । ఓం ముక్తిదాయ నమః । ఓం మునిసన్నుతాయ నమః । ఓం రత్నసింహాసనారూఢాయ నమః । ఓం రథస్థాయ నమః । ఓం రజతప్రభాయ నమః । ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః । ఓం సురశత్రుసుహృదే నమః । ఓం కవయే నమః । ఓం తులావృషభరాశీశాయ నమః ॥ 90 ॥

ఓం దుర్ధరాయ నమః । ఓం ధర్మపాలకాయ నమః । ఓం భాగ్యదాయ నమః । ఓం భవ్యచారిత్రాయ నమః । ఓం భవపాశవిమోచకాయ నమః । ఓం గౌడదేశేశ్వరాయ నమః । ఓం గోప్త్రే నమః । ఓం గుణినే నమః । ఓం గుణవిభూషణాయ నమః । ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః ॥ 100 ॥

ఓం జ్యేష్ఠాయ నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం శుచిస్మితాయ నమః । ఓం అపవర్గప్రదాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం సంతానఫలదాయకాయ నమః । ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః । ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః ॥ 108 ॥